SRPT: కోదాడ 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగుపరచాలని, గర్భిణీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో సూర్యనారాయణ, వైద్య సిబ్బంది ఉన్నారు.