NLG: RTC కార్మికులు చేపట్టిన 3 రోజుల సమ్మె ముగియడంతో ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మళ్లీ గాడిలో పడింది. సమ్మె విరమణతో కార్మికులు తిరిగి విధుల్లో చేరడంతో బస్సులు యథావిధిగా రోడ్డెక్కుతున్నాయి. అయితే ఈ మూడు రోజుల సమ్మె వల్ల RTCకి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక రోజుకు సగటున రూ.1.70 కోట్ల చొప్పున, 3రోజులకు కలిపి మొత్తం రూ.5.01 కోట్ల ఆదాయానికి గండిపడింది