BHPL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా 14-15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకాలు వెయ్యనున్నట్లు DMHO డా. మధుసూదన్ తెలిపారు. ఇవాళ DMHO కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2400 మంది బాలికలను గుర్తించారు. టీకా 95% రక్షణ ఇస్తుందని, గర్భిణీలు, అలర్జీ ఉన్నవారు ఈ టీకాలను వేయించుకోవద్దని సూచించారు.