WNP: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.