RR: పలుగుట్ట నుంచి తోలుకట్ట వరకు BT రోడ్డు నిర్మాణం కోసం రూ. 5.5 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. TPCC ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు మంత్రిని కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.