KMR: సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళ నడుమ మహిళలు బోనాలు ఎత్తుకొని పెద్దమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.