మహబూబ్‌నగర్: జిల్లాలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ వెంకయ్యకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. 34 ఏళ్ల సేవలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ఎస్పీ కొనియాడారు.