నిర్మల్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20 నుంచి 27 వరకు రెండు విడతల్లో (ఉ. 9- మ. 12గంటలు, మ.2:30,- సా.5:30 గంటలు) పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.