KMM: జిల్లాలో జీరో మాతృ, శిశు మరణాలు లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ప్రసవం సురక్షితంగా జరుగుతుందనే సందేశం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీరో మాతృ, శిశు మరణాల లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలన్నారు.