KNR: రామడుగు మండలం వెదిర వద్ద జాతీయ రహదారిపై మంగళవారం పోలీస్ అధికారులు జీబ్రా క్రాసింగ్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. యువత అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దని తల్లిదండ్రులను కోరారు.