MLG: వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ గణపురంలో అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. జయంతి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా సర్పంచ్ మడకం సుభద్ర ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జై భీమ్ జెండాను ఆవిష్కరించారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.