KNR: జిల్లాలో కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు.