MDCL: మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 286 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 251 ద్విచక్ర వాహనదారులు, 9 త్రిచక్ర డ్రైవర్లు, 26 నాలుగు చక్ర వాహనదారులు ఉన్నారు. BAC ప్రకారం 36–200 mgలో 259 మంది, 201–300 mgలో 17 మంది, 301–550 mgలో 10 మంది గుర్తించారు. అన్ని కేసులను కోర్టులో ప్రవేశ పెడతామన్నారు.