VKB: గోరక్ష చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంట్వారం ఎస్సై విమలకు వినతిపత్రం సమర్పించారు. విహెచ్పి పెద్దెముల్ ఖండ్ ప్రధాన కార్యదర్శి వెంకట్ ధర్మచక్ర పాల్గొని మాట్లాడుతూ.. గోవధ, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాలను సమర్థంగా అమలు చేసి గోసంరక్షణకు సహకరించాలని విన్నవించారు.