SDPT: ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెతో నంగునూరు మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్, బస్సులు లేక పూర్తిగా వెలవెలబోతోంది. ఉదయం నుంచి ఒక్క బస్సు కూడా రాకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.