BDK: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎంను కలిసిన సందర్భంగా పలు సమస్యలు ప్రస్తావించారు. ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పెంచుతామని హామీ లభించినట్లు చెప్పారు. భూ హక్కులు, రోడ్లు, చెక్ డ్యాంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.