WGL: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో కావ్య ఈరోజు మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.