ADB: శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బేల ఎస్ఐ మధు కృష్ణ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మధు కృష్ణను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి గ్రామాల అభివృద్ధిలో యువకులు కీలక పాత్ర పోషించాలని ఎస్ఐ సూచించారు.