KMM: నేలకొండపల్లి చెరువు కట్ట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.