NGKL: ఉపాధి హామీ కూలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు మంగళవారం డిమాండ్ చేశారు. ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్‌లో కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.