PDPL: మంథని మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామని, పట్టణ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.