ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గాజానంద్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను మొత్తాన్ని మున్సిపల్ కార్యాలయంలో నేరుగా లేదా బిల్ కలెక్టర్ల వద్ద చెల్లించవచ్చన్నారు. CDMA వెబ్సైట్లో చెల్లించే సదుపాయం కూడ ఉందన్నారు.