KNR: హుజూరాబాద్ పట్టణ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. యార్డుకు వ్యతిరేకంగా 22 రోజులుగా సాగుతున్న నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. 500 ఎకరాల్లో యార్డు నిర్మించే ప్రభుత్వ ఆలోచనను అడ్డుకోవడానికి అఖిల పక్షంతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించబోమని అన్నారు.