నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో పునర్నిర్మాణం చేపట్టిన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి పాల్గొంటారని కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.