సత్యసాయి: CM చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు జాతి అభ్యున్నతి, ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం తపించే మహర్షి చంద్రబాబు అని ఆయన కొనియాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.