మీ ముఖాన్ని ఎండకు, కాలుష్యానికి క్లాత్‌తో కప్పివేయడం వల్ల ముఖంపై ఉన్న చెమట, దుమ్ము చర్మంలోనే చిక్కుకుపోతుంది. దీంతో బ్యాక్టీరియా మొత్తం చర్మంపై ఉండే రంధ్రాలను మూసి వేస్తుంది. ముఖం జిడ్డుగా తయారవుతుంది. మొటిమలు, నల్లమచ్చలు వంటి సమస్యలకు కారణమవుతుంది. చర్మం నిగారింపుగా ఉండాలంటే కాంతి, గాలి అవసరం. అందువల్ల ఎప్పుడూ ముఖానికి సహజ ఆక్సిజన్, చల్లని గాలి తగిలేలా చేయాలి.