తూ.గో: రాజమండ్రి సమీపంలోని గామన్ వంతెనపై ఆదివారం అర్ధరాత్రి బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కొవ్వూరు(M) తెనకనమెట్టకు చెందిన కోడి లక్ష్మీగణపతి (32)తో పాటు ఎదురుగా బైకుపై వస్తున్న మరో గుర్తుతెలియని యువకుడు(27) ఉన్నారు. లక్ష్మీగణపతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.