W.G: భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.