JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకి సేవ కన్నులపండువగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రకరకాల పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.