MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామపంచాయతీ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ తై బజార్ వేలం పాటను మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనదలచిన వారు రూ.20,000 డిపాజిట్ చేయాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేలం దక్కించుకున్న వారు 50% సొమ్మును వెంటనే చెల్లించి, మిగిలిన మొత్తానికి ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించాల్సి ఉంటుందన్నారు.