WGL: దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో పదో తరగతి విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఈ నెల 18న ఇంట్లో మాత్రలు అధిక మోతాదులో తీసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.