SDPT: రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని BRSయువజన విభాగం నేత నిమ్మ రజనీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. 18 ఏళ్ల యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడం మోసగించడమేనని ధ్వజమెత్తారు.