NRML: నిర్మల్ పట్టణంలోని పంజెషా ఉర్దూ ప్రాథమిక పాఠశాల మూసివేతపై మేవా, టీఎస్పీటీఏ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకుని, పాఠశాలను వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. స్పందన లేకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని జిల్లా విద్యాశాఖ అధికారికి మంగళవారం సాయంత్రం నోటీసు అందజేశారు.