BHNG: రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులతో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణతో కలిసి అదనపు కలెక్టర్ పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.