SRCL: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సీపీఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడేది డ్రైవర్లే అన్నారు.