SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మహిళలకు నర్సింగ్ ఉచిత శిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మహిళలకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ వసతి, ఉపాధి కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని మున్సిపాలిటీలోని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.