NLG: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ కోరారు. శనివారం మండలంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు పంట చేతికి వచ్చే సమయమైనా కూడా రైతుబంధు విడుదల చేపడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు.