BDK: దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఇవాళ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇటీవల నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల వారికి సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు.