MDK: ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానంలో 56 రోజుల హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. మొత్తం రూ.52.12 లక్షల నగదుతో పాటు, 0.024 గ్రాముల బంగారం, 0.927 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో వీరేశం తెలిపారు. బ్యాంక్ సిబ్బంది, సేవా ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకున్నారు.