WGL: పర్వతగిరి మండలం ముంజలకుంట తండాలో అనుమతులు లేకుండా డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వెంటనే ప్రజలు ప్లాంట్ మూసివేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నిర్వాహకులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి స్వర్ణ నోటీసులు జారీ చేశారు. ప్లాంట్‌పై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ అధికారి శేషాంజన్ స్వామి తెలిపారు.