ఆసిఫాబాద్: జిల్లాలో ఈనెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. SSCకి 643 మందికి 3 కేంద్రాలు, ఇంటర్‌కు 360 మందికి 2 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, భద్రతా బందోబస్తు, విద్యార్థుల కోసం RTC బస్సులు, తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు.