SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డి నగర్లో (PNG) గ్యాస్ సరఫరాను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోదాడ పట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఉన్నారు.