HNK: 31వ డివిజన్ రాజు హోటల్ కూడలిలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మంద సంపత్ అన్నారు. 31వ డివిజన్లో సీపీఎం నేతలు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 31వ డివిజన్లో పేరుకుపోయిన డ్రైనేజీ, పారిశుధ్య పనులను సత్వరమే పరిష్కరించి డివిజన్ సమగ్ర అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు.