JGL: జనగణన-2027 తొలి విడత ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీ కేరి సూచించారు. మే 11-జూన్ 9 వరకు డిజిటల్ విధానంలో ఈ గణన సాగనుంది. జగిత్యాల జిల్లాలో ఇందుకోసం 1,899 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.