NRML: దస్తురాబాద్ మండల కేంద్రంలో ఓ కాలనీలో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో కిరాణా దుకాణాలను తహశసీల్దార్ కనక యాదవ రావు మంగళవారం తనిఖీ చేశారు. పలు వస్తువులను క్షుణంగా పరిశీలించారు. కాలం చెందిన వస్తువులను అమ్మితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట GPO వెంకట నర్సయ్య, తదితరులు ఉన్నారు.