ADB: జిల్లాకు నూతనంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఆర్.ఎస్. చిత్రు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పనుల పురోగతి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధానాలపై కలెక్టర్ రాజర్షి షా పలు సూచనలు చేశారు.