WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని (IKP) ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాసంగి కోతలు పూర్తయి వారం రోజులు అవుతున్న కేంద్రం తెరవకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు ఆరబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచామని, ఆలస్యమైతే వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.