NZB: నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుభం ప్రకాష్ గతంలో కరీంనగర్ రూరల్ ఏసీపీగా పనిచేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తించారు.