BHNG: ఆలేరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో స్థానికులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన సామాజిక న్యాయం మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పేర్కొన్నారు.