VKB: జిల్లాలో మలేరియా కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయి. సుమారు నాలుగేళ్లుగా జిల్లా వ్యాప్తంగా మలేరియా కేసులు నమోదు కాలేదని గణంకాలు చెబుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో ప్రజల్లో మెరుగైన అవగాహన ఏర్పడి 2022-25 వరకు జిల్లాలో ఎక్కడా మలేరియా కేసు నమోదు కానట్లు అధికారులు చెబుతున్నారు.